బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 12:29:00

వారికి జీతాలు చెల్లించండి: బాంబే హైకోర్టు

వారికి జీతాలు చెల్లించండి: బాంబే హైకోర్టు

ముంబై: ఈ ఏడాది జనవరి నుంచి విధులకు హాజరవుతున్నప్పటికీ 47 మంది కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించకపోవడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే జీతాలు చెల్లించాలని మహారాష్ట్ర సిటీ అండ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (సీఐడీసీవో)ను ఆదేశించింది. న్యూ పాన్వెల్‌లో ఉన్న సీఐడీసీవోలో 47 మంది తోటమాలీలు కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్నారు. వారు జనవరి నుంచి విధులకు హాజరవుతున్నప్పటికీ సంస్థ వారికి జీతాలు చెల్లించలేదు. దీంతో కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన కోర్టు వారికి వెంటనే జీతాలు చెల్లించాలని, ఆ 47 మందిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. వారికి పీపీఈ కిట్లు కూడా అందించాలని పేర్కొంది.


logo