మంగళవారం 02 మార్చి 2021
National - Jan 22, 2021 , 10:09:08

ఆస్ప‌త్రి వ‌ద్ద బాంబు.. భ‌య‌ప‌డ్డ‌ రోగులు

ఆస్ప‌త్రి వ‌ద్ద బాంబు.. భ‌య‌ప‌డ్డ‌ రోగులు

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నోయిడాలోని సెక్టార్ 63లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రి వ‌ద్ద శుక్ర‌వారం తెల్ల‌వారుజామున బాంబు ల‌భ్య‌మైంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఆస్ప‌త్రి సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. బాంబు ఉంద‌ని తెలియ‌డంతో రోగులు తీవ్ర భ‌యాందోన‌ళ‌కు గుర‌య్యారు. అక్క‌డికి చేరుకున్న బాంబు స్క్వాడ్‌, పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. బాంబు ఎవ‌రు పెట్టి ఉంటార‌నే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

నిన్న‌నే బాంబు బెదిరింపు కాల్‌

నోయిడాలోని సెక్టార్ 27లోని కైలాష్ ఆస్ప‌త్రి వ‌ద్ద బాంబు పెట్టిన‌ట్లు ఆ హాస్పిట‌ల్ ల్యాండ్ నంబ‌ర్‌కు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసుల‌కు ఆస్ప‌త్రి సిబ్బంది స‌మాచారం ఇవ్వ‌డంతో ఆ ప‌రిస‌రాల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేసి బాంబు లేద‌ని తేల్చారు. ఈ క్ర‌మంలో పోలీసులు, ఆస్ప‌త్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అలా కాల్ చేసిన మ‌రుస‌టి రోజే మ‌రో ప్ర‌యివేటు ఆస్ప‌త్రి వ‌ద్ద బాంబు ల‌భ్యం కావ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

VIDEOS

logo