శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 05, 2020 , 15:51:32

ప్రైవేటు పాఠ‌శాల‌లో బాంబు క‌ల‌క‌లం

ప్రైవేటు పాఠ‌శాల‌లో బాంబు క‌ల‌క‌లం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ : భింద్ జిల్లాలోని మెహ‌గావ్‌లోని ఓ ప్రైవేటు పాఠ‌శాల‌లో బాంబు క‌ల‌క‌లం సృష్టించింది. పాఠ‌శాల‌లో బాంబును గుర్తించిన సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటాహుటిన‌ పాఠ‌శాల‌కు చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. ఆ పాఠ‌శాల‌లో ఉన్న సీసీ కెమెరాల‌ను దుండ‌గులు ధ్వంసం చేశారు. ఘ‌ట‌నాస్థ‌లిలో ఓ ఉత్త‌రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మ‌రో 7 పాఠ‌శాల‌ల్లో బాంబులు అమ‌ర్చిన‌ట్లు దుండ‌గులు లేఖ‌లో పేర్కొన్నారు. దీంతో మిగ‌తా పాఠ‌శాల‌ల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo