ఆదివారం 17 జనవరి 2021
National - Dec 05, 2020 , 22:10:56

బీజేపీ ర్యాలీపై బాంబులు.. తృణముల్‌ కార్యకర్తల పనేనని ఆరోపణలు

బీజేపీ ర్యాలీపై బాంబులు..  తృణముల్‌ కార్యకర్తల పనేనని ఆరోపణలు

అసన్సోల్ :  పశ్చియ బెంగాల్‌లోని పచ్చిమ బర్ధామన్‌ జిల్లాలో శనివారం జరిగిన బీజేపీ ర్యాలీపై గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. అధికార తృణముల్‌ కాంగ్రెస్‌కు చెందిన గుండాలే దాడికి పాల్పడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ నాయకుడు లఖాన్‌ ఘోరై మాట్లాడుతూ..  తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గుండాలు తమపై కాల్పులు జరిపి బాంబులు విసిరినట్లు ఆరోపించారు. 

దాడిలో ఐదుగురు నుంచి ఏడుగురు గాయడ్డారు. పోలీసులను సాయం కోరితే కనీస చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఈ ఆరోపణలను తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ తిప్పికొట్టింది. కొందరు తమ పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతుండగా బీజేపీ కార్యకర్తలు ర్యాలీ పేరుతో వారిపై దాడికి పాల్పడ్డారని తృణముల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు బిధాన్‌ ఉపాధ్యాయ ఆరోపించారు. కాషాయం పార్టీ ఆరోపణనలను తీవ్రంగా ఖండించారు. ఘటనకు నిరసనగా పశ్చిమబెంగాల్‌ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్‌వర్గీయ తెలిపారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.