సోమవారం 18 జనవరి 2021
National - Dec 02, 2020 , 08:02:12

బాలీవుడ్‌ హీరో సన్నీ డియోల్‌కు కరోనా పాజిటివ్‌

బాలీవుడ్‌ హీరో సన్నీ డియోల్‌కు కరోనా పాజిటివ్‌

సిమ్లా: బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కరోనా బారినపడ్డారు. నిన్న కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని హిమాచల్‌ ప్రదేశ్‌ ఆరోగ్య శాఖ కార్యదర్శి అమితాబ్‌ అవస్థీ చెప్పారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన గత కొన్నిరోజులుగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు మనాలీలో ఉంటున్నారు. 

సన్నీడియోల్ ఈమధ్యే ముంబైలో తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో కులూ జిల్లాలోని మనాలీ సమీపంలో ఉన్న ఫాంహౌస్‌లో గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, సన్నీ డియోల్‌, అతని స్నేహితులు కులూ జిల్లా నుంచి ముంబైకి వెళ్లాలని నిర్ణయించు కున్నారు. ఈనేపథ్యంలో వారు కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అమితాబ్‌ అవస్థీ వెల్లడించారు.