గురువారం 04 జూన్ 2020
National - May 10, 2020 , 14:22:55

అమ్మ నూరిపోసిన ధైర్య‌మే నాకు రాజ‌కీయ పునాది: కేర‌ళ సీఎం

అమ్మ నూరిపోసిన ధైర్య‌మే నాకు రాజ‌కీయ పునాది: కేర‌ళ సీఎం

తిరువ‌నంత‌పురం: అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్ తన మాతృమూర్తిని గుర్తు చేసుకున్నారు. త‌న త‌ల్లి నూరిపోసిన ధైర్య‌మే త‌న‌కు రాజ‌కీయ పునాది అయ్యింద‌ని ఆయ‌న చెప్పారు. తన తల్లి జీవితంలో ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ధైర్యంగా ఎదుర్కొన్నద‌ని, త‌మ‌ను ప్ర‌యోజ‌కుల‌ను చేయ‌డానికి ఆమె ధృడ‌సంక‌ల్పంతో ప‌నిచేశార‌ని, ఆమెలోని ధైర్యం, సంక‌ల్పం త‌న‌కు చాలా పాఠాలు నేర్పాయ‌ని విజ‌య‌న్ వెల్ల‌డించాఆరు. 

'అందరి లాగే నా జీవితంలోనూ అమ్మ ప్రభావం ఉంది. మా నాన్న అనారోగ్యం కారణంగా త‌క్కువ వ‌య‌సులోనే చ‌నిపోయారు. దీంతో కుటుంబ బాధ్యతలు మా అమ్మపై పడ్డాయి. వాటిని ఆమె అత్యంత ధైర్యంతో ఎదుర్కొన్న‌ది. మొత్తం పద్నాలుగు మంది పిల్లల్లో పదకొండు మందిని ఆ మాతృమూర్తి కోల్పోయింది. ఆమె చిన్న కుమారుడిగా నేను పెరిగాను. జీవితంలో ఎలాంటి క‌ష్టం ఎదురైనా ఎదుర్కోవ‌డం ఎలాగో మా అమ్మే నాకు నేర్పింది. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా మా అమ్మ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నా. మాతృమూర్తులందరికీ కృతజ్ఞలుస‌ అని త‌న‌ ఫేస్‌బుక్‌లో సీఎం పినర‌యి  పోస్ట్ చేశారు.


logo