శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 22:15:44

అంతిమ‌యాత్రకు ఆ న‌లుగురు క‌రువై.. వీడియో

అంతిమ‌యాత్రకు ఆ న‌లుగురు క‌రువై.. వీడియో

బెంగ‌ళూరు: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌ప‌చ‌వ్యాప్తంగా ప‌లు హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. క‌రోనా బారిన‌ప‌డి మ‌ర‌ణించిన వారిలో చాలామంది అయిన వారి మ‌ధ్య అంతిమ‌సంస్కారాల‌కు కూడా నోచుకోవ‌డం లేదు. కావాల్సిన వారికి క‌డ‌సారి చూపులు క‌రువ‌య్యాయి. మ‌రికొన్ని ఘ‌ట‌న‌ల్లో క‌రోనా భ‌యం ముందు మాన‌త్వం మంట‌గ‌లిసి పోతున్న‌ది. ఎవ‌రు ఏ కార‌ణంతో చ‌నిపోయినా క‌రోనా చావేమో అన్న భ‌యంతో జ‌నం ఆ ఇంటివైపు క‌న్నెత్తి కూడా చూడ‌టంలేదు. 

తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్రం బెల‌గావి జిల్లా అథాని తాలూకాలో అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకున్న‌ది. ఓ ఇంట్లో వ్య‌క్తి చ‌నిపోవ‌డంతో ఆ కుటుంబ‌స‌భ్యులు చుట్ట‌ప‌క్కాలు అంద‌రికీ స‌మాచారం ఇచ్చారు. కానీ క‌రోనా భ‌యంతో ఎవ‌రూ చావుకు రాలేదు. దీంతో అంతిమ‌యాత్ర‌కు స‌హ‌క‌రించాల‌ని ఇరుగుపొరుగును ప్రాధేయ‌ప‌డ్డారు. అయినా, క‌రోనా మ‌ర‌ణామేమో అనే భ‌యంతో ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో కుటుంబ‌స‌భ్యులే తోపుడు బండిపై శ‌వాన్ని తీసుకెళ్లి అంత్య‌క్రియలు నిర్వహించారు. 

ఆ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో చూడ‌వ‌చ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo