శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 05, 2021 , 02:22:04

వాట్సాప్‌లో బీవోబీ సేవలు

వాట్సాప్‌లో బీవోబీ సేవలు

ముంబై, జనవరి 4: ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) ప్రముఖ సామాజిక మాధ్యమంలో బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించింది. బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్‌, చెక్‌ స్టేటస్‌ ఎంక్వైరీ, చెక్‌బుక్‌ రిక్వెస్ట్‌, డెబిట్‌ కార్డ్‌ బ్లాకింగ్‌ లాంటి సేవలతోపాటు వివిధ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్‌ ద్వారా అందజేస్తున్నట్లు బీవోబీ వెల్లడించింది. సామాజిక మాధ్యమాల ప్రాముఖ్యత నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారుల అవసరాలను సులభంగా తీర్చేందుకు వాట్సాప్‌ బ్యాంకింగ్‌ దోహదపడుతుందని భావిస్తున్నట్లు బీవోబీ ఎగ్జిక్యూటివ్‌ ఏకే ఖురానా సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీవోబీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఈ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఖాతాదారులు బీవోబీకి చెందినవారు కాకపోయినా ఈ వేదికను ఉపయోగించుకుని బీవోబీ సేవలు, ఆఫ ర్లు, ఏటీఎం కేంద్రాలు, బ్యాంకు శాఖల వివరాలను తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

VIDEOS

logo