గురువారం 09 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 14:38:58

బోటు బోల్తా.. ఐపీఎస్ ఆఫీస‌ర్లు సుర‌క్షితం

బోటు బోల్తా.. ఐపీఎస్ ఆఫీస‌ర్లు సుర‌క్షితం

హైద‌రాబాద్‌:  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పెను విషాదం త్రుటిలో త‌ప్పింది.  8 మంది ఐపీఎస్ ఆఫీస‌ర్లు ఉన్న ఓ బోటు బోల్తాప‌డింది.  వాట‌ర్‌స్పోర్ట్స్‌లో భాగంగా భూపాల్‌లోని బోట్ క్ల‌బ్‌లో బోటు రేసును నిర్వ‌హించారు. అయితే వేడుక‌లో పాల్గొనేందుకు ఫ్యామిలీల‌తో వ‌చ్చిన ఐపీఎస్ ఆఫీస‌ర్లు రేసులో పాల్గొన్నారు. 8 మంది ఆఫీస‌ర్లు ఉన్న ఓ బోటు బోల్తాప‌డింది.  ఆ బోటులో ఉన్న వారంతా లైఫ్ జాకెట్ తొడుక్కోవ‌డం వ‌ల్ల ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. రెస్క్యూ టీమ్ వెంట‌నే వారిని ర‌క్షించింది.

 


logo