సోమవారం 13 జూలై 2020
National - Jun 24, 2020 , 11:03:58

వారణాసిలోని గంగా నదిలో పడవల పునరుద్ధరణ

వారణాసిలోని గంగా నదిలో పడవల పునరుద్ధరణ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర వారణాసిలోని గంగా నదిలో బుధవారం నుంచి పడవలను పునరుద్ధరించారు. దీంతో భక్తులు, పర్యాటకులతో ఆ ప్రాంతం సందడిగా మారింది. సాధారణంగా ఈ పడవల్లో నది మధ్యలోకి వెళ్లి మరణించిన వారి అస్తికలను గంగలో నిమజ్జనం చేస్తారు. అయితే కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల వారణాసికి ఎవరూ రావడం లేదు. దీంతో మూడు  నెలలుగా పడవ నిర్వాహకులకు ఉపాధి లేకుండా పోయింది. 

కాగా, లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఈ నెల మొదటి వారం నుంచి ఆలయాలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. దీంతో వారణాసికి భక్తుల రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గత మూడు నెలలుగా నిలిపివేసిన పడవ సేవలను బుధవారం నుంచి పునరుద్ధరించారు. దీంతో పడవ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. logo