గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 13:14:23

బోటు మున‌క‌.. 88 మంది క్షేమం

బోటు మున‌క‌.. 88 మంది క్షేమం

హైద‌రాబాద్‌:  మ‌హారాష్ట్ర‌లో ఇవాళ ఓ ఫెర్రీ బోటు బోల్తా ప‌డింది. ముంబై గేట్‌వే నుంచి మాండ‌వా వెళ్తున్న బోటు.. మార్గ‌మ‌ధ్యంలో బోల్తా కొట్టింది. అజంతా బోటులో ఉన్న 88 మంది ప్ర‌యాణికుల‌ను ర‌క్షించారు. ఇవాళ ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  మాండ‌వా నుంచి బ‌య‌లుదేరి వెంట‌నే బోటు ఓ రాయిని ఢీకొట్టింది. రాయిని ఢీకొన్న త‌ర్వాత బోటులోకి నీరు ప్ర‌వేశించింది.  దాంతో బోటు మున‌గ‌డం ప్రారంభ‌మైంది. మెరైన్ పోలీసుల‌కు స‌మాచారం రావ‌డంతో.. అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. మునుగుతున్న బోటులో ఉన్న వారిని మ‌రో బోటులోకి ఎక్కించారు. 


logo