సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 13:33:40

వార్డుకు ఒక గ‌ణ‌ప‌తి విగ్ర‌హమే..

వార్డుకు ఒక గ‌ణ‌ప‌తి విగ్ర‌హమే..

హైద‌రాబాద్‌: వినాయ‌క‌చ‌వితి వ‌చ్చేస్తున్న‌ది.  ఈ నేప‌థ్యంలో ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆదేశాలు జారీ చేసింది. వార్డుకు ఒక గ‌ణ‌ప‌తి విగ్ర‌హాన్ని మాత్ర‌మే ప్ర‌తిష్టించాల‌ని త‌మ అభ్య‌ర్థ‌న‌లో కోరింది. అంథేరి, జూహూ, వెర్‌సోవా లాంటి ప్రాంతాల్లో వార్డుకు ఒక వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని బీఎంసీ సూచించింది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పేర్కొన్న‌ది. అంధేరి వెస్ట్‌, జూహూ, వెర్సోవాలో చాలా వైభ‌వం గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు. అయితే అక్క‌డ గ‌ణ‌ప‌తి మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేసే వారికి అసిస్టెంట్ మున్సిప‌ల్ క‌మిష‌న్ విశ్వాస్ మోటే గ‌త వారం ఓ లేఖ‌లో ఈ అభ్య‌ర్థ‌న చేశారు. ప‌ది రోజ‌లు పాటు సాగే గ‌ణేశ్ ఉత్స‌వాలు ఈ ఏడాది ఆగ‌స్టు 22న ప్రారంభంకానున్నాయి.logo