ఆదివారం 05 జూలై 2020
National - Jun 23, 2020 , 16:39:33

తప్పించుకుపోయిన కరోనా రోగుల కోసం గాలింపు!

తప్పించుకుపోయిన కరోనా రోగుల కోసం గాలింపు!

ముంబై: రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో సతమతమవుతున్న మహారాష్ట్రలోని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)కి మళ్లీ ఒక తలనొప్పి వచ్చి పడింది.  మూడు నెలల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలిన 70 మంది కనిపించకుండా పోయారు. దీంతో వారిని పట్టుకునేందుకు బీఎంసీ పోలీసుల సాయాన్ని కోరింది. 

‘మాలాద్‌ పీ నార్త్‌వార్డులో మూడు నెలల క్రితం 70 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించాం. ఇటీవల వాళ్ల ఇంటికి వెళ్లి చూడగా ఎవ్వరూ కనిపించలేదు. కొందరు ఇళ్లకు తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. మరి కొందరు చిరునామా తప్పుగా ఇచ్చారు. ఇంకొందరు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు.’ అని బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. దీంతో పోలీసుల సాయం కోరామని, వారు కాల్‌ డిటెయిల్‌ రికార్డు (సీడీఆర్‌) ద్వారా  70 మందికోసం గాలిస్తున్నారని తెలిపారు. వారు దొరకకుంటే మిగతా వాళ్లకు ప్రమాదమని, వారి ద్వారా ఎంతమందికి వైరస్‌ సోకిందో గుర్తించాల్సి ఉంటుందన్నారు. logo