ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 08:33:27

క్వారంటైన్ నుంచి ప‌ట్నాకు ఐపీఎస్ విన‌య్ తివారీ!

క్వారంటైన్ నుంచి ప‌ట్నాకు ఐపీఎస్ విన‌య్ తివారీ!

ముంబై: బీహార్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విన‌య్ తివారీ క్వారంటైన్ నుంచి విముక్తి పొంద‌నున్నారు. దీంతో ఆయ‌న నేడు ప‌ట్నా తిరిగి వెళ్ల‌నున్నారు. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ మ‌రణానికి న‌టి రేఖా చక్ర‌బ‌ర్తి కార‌ణ‌మ‌ని ఆయ‌న తండ్రి బీహార్‌లోని ప‌ట్నా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు ద‌ర్యాప్తున‌కు ప‌ట్నా పోలీసులు ఐపీఎస్ అధికారి విన‌త్ తివారీ నేతృత్వంలో 14 మందితో ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. కేసు విచార‌ణ‌కు ప‌ట్నా పోలీసులు ఆగ‌స్టు 2న ముంబై వ‌చ్చారు. అయితే ఐపీఎస్ అధికారితో సహా అంద‌రిని బృహ‌న్‌ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ (బీఎంసీ) 14 రోజుల క్వారంటైన్ త‌ర‌లించింది.  

కాగా, ఐపీఎస్ అధికారి విన‌య్ తివారిని క్వారంటైన్ నుంచి వెళ్లిపోవ‌డానికి బీఎంసీ అంగీక‌రించింది. అయితే ఈ నెల 8వ తేదీలోగా ముంబైని విడిచివెళ్లిపోవాల‌ని ష‌ర‌తు విధించింది. దీంతో ఆయ‌న నేడు ప‌ట్నా తిరిగివెళ్ల‌నున్నారు. క్వారంటైన్‌లో ఉన్న నలుగురు పోలీసు అధికారులు‌ గురువారం ప‌ట్నాకు వెళ్లిపోయార‌ని విన‌య్ కుమార్‌ తెలిపారు.


logo