మాస్కులు ధరించని, జరిమానా చెల్లించని వారితో శానిటైజ్‌ పనులు

Oct 31, 2020 , 21:53:10

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో మాస్కులు ధరించని వారికి వినూత్నంగా గుణపాఠం చెబుతున్నారు బృహన్ ముంబై మున్సిపల్‌ అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి ఇప్పటికే జరిమానాలు విధిస్తున్నారు. వాటిని చెల్లించని వారితో తాజాగా శానిటైజేషన్‌ పనులు చేయిస్తున్నారు. ముంబైలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో గత రెండు నెలలుగా మాస్కు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఆ జరిమానా చెల్లించని వారితో శానిటైజేషన్‌ పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగానైనా మాస్కులు ధరించడంపై వారిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD