బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 16:37:00

కంగ‌నా పిటిష‌న్‌ను కొట్టివేయండి!

కంగ‌నా పిటిష‌న్‌ను కొట్టివేయండి!

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేయాలంటూ బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) బాంబే హైకోర్టును ఆశ్ర‌యించింది. అనుమ‌తులు స‌రిగా లేవ‌నే కార‌ణంతో  బీఎంసీ తన కార్యాలయాన్ని కూల్చివేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ ఇటీవ‌ల కంగ‌నా ర‌నౌత్ బాంబే హైకోర్టులో పిటిష‌న్ వేశారు. తన కార్యాలయాన్ని పాక్షికంగా కూల్చివేసినందుకు రూ. 2 కోట్ల నష్టపరిహారం ఇప్పించాల‌ని ఆ పిటిష‌న్‌లో కోరారు. ఈ నేప‌థ్యంలో కంగ‌నా పిటిష‌న్‌ను కొట్టివేయాల‌ని కోరుతూ బీఎంసీ కూడా అదే కోర్టులో పిటిష‌న్ వేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo