ఆదివారం 31 మే 2020
National - May 07, 2020 , 22:07:33

ఎన్నారైల‌ను క్వారంటైన్‌లో ఉంచేందుకు సిద్ధం చేస్తున్న బీఎంసీ

ఎన్నారైల‌ను క్వారంటైన్‌లో ఉంచేందుకు సిద్ధం చేస్తున్న బీఎంసీ

ముంబై:  విదేశాల నుంచి వ‌చ్చే ఎన్నారైలు, విద్యార్థులను క్వారంటైన్‌లో ఉంచేందుకు ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. ముంబైలోని 88 హోట‌ళ్ల‌లో 3,343 గ‌దులను రిజ‌ర్వ్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారిని నేరుగా ఈ హోట‌ళ్ల‌లోకి త‌ర‌లించ‌నున్నారు. 1900 మంది భార‌తీయుల‌ను ఏడు విమానాల్లో ముంబైకి తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని బీఎంసీ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

 బ్రిట‌న్‌, యూఎస్ఏ, బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, సింగ‌పూర్‌, మ‌లేషియా దేశాల నుంచి భార‌తీయ పౌరుల‌ను ఈ రోజు నుంచి ఇండిన‌య‌న్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో భార‌త్‌కు తీసుకురానున్నారు. రెండు, మూడు,నాలుగు, ఐదు న‌క్ష‌త్రాల హోట‌ళ్లు, ఓయో హోట‌ళ్ల‌లో గ‌దులు రిజ‌ర్వ్ చేశారు. హోటల్ గ‌దిలోక్వారంటైన్ ముగిసిన అనంత‌రం క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తారు. క‌రోనా పాజిటివ్ వ‌స్తే ఆస్ప‌త్రికి, నెగిటివ్ వ‌స్తే ఇంటికి పంపుతామ‌ని బీఎంసీ ప్ర‌తినిధి విజ‌య్ ఖ‌న‌కే తెలిపారు.  


logo