శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 16:41:42

ముంబైవాసుల్లో చాలామంది కొవిడియట్సేనట!

ముంబైవాసుల్లో చాలామంది కొవిడియట్సేనట!

ముంబై: కొవిడియట్స్‌.. కొవిడ్‌ నిబంధనలు పాటించనివారిని ఇలా పిలుస్తున్నారు. అయితే, ముంబైలో చాలామంది ఇలాంటివారేనని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) వెల్లడించింది. మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న తరుణంలోనూ చాలామంది పనిలేకున్నా బయటతిరుగుతున్నారని, కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని తెలిపింది. మెరైన్‌ డ్రైవ్‌తోపాటు ఇతరచోట్ల మాస్కులు ధరించకుండానే వాకింగ్‌ చేస్తున్నారని పేర్కొంది. 

శనివారం ఒక్కరోజే 432 మందికి  మందికి జరిమానా విధించినట్లు బీఎంసీ తెలిపింది. రూ. 90,000 ఫైన్‌ రూపంలో వచ్చినట్లు వెల్లడించింది. మాస్కు ధరించనివారికి మొదట్లో రూ .1000 జరిమానా విధిస్తామని బీఎంసీ ప్రకటించింది. అయితే, ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో ఈ మొత్తాన్ని రూ .200 కు తగ్గించింది. కాగా, మాస్కు ధరించకుండా పట్టుబడ్డవారు ఎక్కువగా వింతైన సాకులు చెబుతున్నారని ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అధికారి జయదీప్ మోర్ తెలిపారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.