గురువారం 02 జూలై 2020
National - Jul 01, 2020 , 12:55:20

నైవెల్లి థ‌ర్మ‌ల్ ప్లాంట్‌లో పేలుడు.. ఆరుగురు మృతి

నైవెల్లి థ‌ర్మ‌ల్ ప్లాంట్‌లో పేలుడు.. ఆరుగురు మృతి

హైద‌రాబాద్‌:  త‌మిళ‌నాడులోని నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్‌లోని రెండ‌వ ద‌శ బాయిల‌ర్‌లో పేలుడు సంభ‌వించింది.  క‌డ‌లూర్ జిల్లాలో ఉన్న థ‌ర్మ‌ల్ ప్లాంట్‌లో ఉన్న బాయిల‌ర్‌లో పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. ఈ  ప్ర‌మాదంలో ఆరుగురు మృతిచెందారు.  13 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. కేంద్ర ప్ర‌భుత్వానికి సంబంధించిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్(నైవెల్లి లిగ్నైట్‌) ప్లాంట్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. చెన్నై నుంచి 180 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్లాంట్ ఉన్న‌ది. గాయ‌ప‌డ్డ‌వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  ప్ర‌స్తుతం బాయిల‌ర్ ఆప‌రేష‌న్ ఆపేశారు. ఈ ప్ర‌మాదం ప‌ట్ల విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్లు ప‌వ‌ర్ ప్లాంట్ అధికారి తెలిపారు. రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఈ ప్లాంట్‌లో పేలుడు జ‌ర‌గడం ఇది రెండ‌వ‌సారి.   

మే నెల‌ల జ‌రిగిన పేలుడులో 8 మంది కార్మికులకు తీవ్ర స్థాయిలో గాయాల‌య్యాయి. రెగ్యుల‌ర్‌, కాంటాక్ట్ వ‌ర్క‌ర్లు ఆ కంపెనీలో ప‌నిచేస్తున్నారు. నైవెల్లి థ‌ర్మ‌ల్ ప్లాంట్ లో 3940 మెగావాట్ల విద్యుత్తును ఉత్ప‌త్తి చేస్తారు.  అయితే బ్లాస్ట్ జ‌రిగిన ప్లాంట్‌లో మాత్రం 1470 మెగావాట్ల విద్యుత్తు ఉత్ప‌త్తి జ‌రుగుతున్న‌ది. నైవెల్లి కంపెనీలో మొత్తం 27వేల మంది ఉద్యోగులు ఉన్నారు.  దీంట్లో 15వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  

ఈ ప్ర‌మాదంలో తొలుత 17 మంది గాయ‌పడిన‌ట్లు స‌మాచారం వ‌చ్చింది.  గాయ‌ప‌డ్డవారిని ఎన్ఎల్‌సీ లిగ్నైట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.  logo