శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 19:24:39

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి

చెన్నై: తమిళనాడులోని విరుదునగర్ సిప్పిపరెయి వద్ద బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా..మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దీంతో సమాచారమందుకున్నఅగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత వల్ల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. logo