ఆదివారం 06 డిసెంబర్ 2020
National - Oct 29, 2020 , 16:32:02

రైతుల ధ‌ర్నా.. రైలు సేవ‌లు బంద్‌

రైతుల ధ‌ర్నా.. రైలు సేవ‌లు బంద్‌

హైద‌రాబాద్‌: అగ్రి చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పంజాబ్ రైతులు కొన్నాళ్ల నుంచి ధ‌ర్నాలు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.  రైల్ రోకోలో పాల్గొంటున్న రైతులు స‌సేమిరా ఆందోళ‌న విర‌మించేది లేదంటున్నారు.  ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రానికి  చెందిన భార‌తీయ కిసాన్ యూనియ‌న్‌తోనూ ఇవాళ మంత్రులు చ‌ర్చించారు.  అయితే ఆ చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం కాలేద‌ని తెలిసింది.  రైల్ రోకో ధ‌ర్నాల‌ను నిలిపివేస్తేనే.. పంజాబ్‌కు రైళ్ల‌ను అనుమ‌తి ఇస్తామ‌ని రైల్వే శాఖ స్ప‌ష్టం చేసింది. కానీ రైతులు మాత్రం ఆందోళ‌న నుంచి వెన‌క్కి త‌గ్గ‌దిలేద‌ని తేల్చేశారు. ఇప్ప‌టికే 30 రైతు సంఘాలు ధ‌ర్నాల నుంచి త‌ప్పుకున్నాయి. కానీ కిసాన్ సంఘ్ మాత్రం త‌మ వ్యూహాన్ని ఉప‌సంహ‌రించేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు.  రైళ్ల‌ను నిలిపివేయ‌డం వ‌ల్ల రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక లోటు ఎదురవుతున్న‌ట్లు రైతు సంఘాల‌తో మంత్రుల బృందం వెల్ల‌డించింది.  రాష్ట్రంలోని ధ‌ర్మ‌ల్ ప్లాంట్ల‌లో నిల్వ‌లు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, ఒక‌వేళ రైళ్ల‌ను అనుమ‌తించ‌ని ప‌క్షంలో బ్లాకౌట్ ఏర్ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ట్లు హెచ్చ‌రిక‌లు వ‌చ్చాయి.