గురువారం 04 మార్చి 2021
National - Nov 25, 2020 , 15:07:42

బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌గా విజయకుమార్‌ సిన్హా

బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌గా విజయకుమార్‌ సిన్హా

పాట్నా : బీజేపీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ సిన్హా 17వ బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌గా బుధవారం ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన తొలి బీజేపీ నాయకుడిగా నిలిచారు. ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిన్హాకు 126 ఓట్లు రాగా.. ఆయనకు వ్యతిరేకంగా 114 మంది ఓటు వేశారు. అంతకు ముందు స్పీకర్‌ ఎన్నికను రహస్య ఓటింగ్‌ ద్వారా నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితే ప్రొటెం స్పీకర్‌ జీతన్‌ రామ్‌ మాంఝీ వినతిని తిరస్కరిస్తూ వాయిస్‌ ఓటు ద్వారా ఎన్నిక జరిపారు. మరోసారి ప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపడంతో హెడ్‌కౌంట్‌ చేపట్టారు. అనంతరం చైర్‌ వద్దకు స్పీకర్‌ను తీసుకువెళ్లాలని సీఎం నితీశ్‌, ఉప ముఖ్యమంత్రులు తార్‌ కిశోర్‌, రేణుదేవి, ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్‌కు ప్రొటెం స్పీకర్‌ సూచించారు. ఇదిలా ఉండగా.. 2005 నుంచి బీహార్‌లో బీజేపీ స్పీకర్ పదవికి తన అభ్యర్థిని నిలబెట్టడం ఇదే మొదటిసారి. అంతకుముందు సందర్భాలలో మిత్రపక్షమైన జేడీ(యూ) పదవిని చేజిక్కించుకుంది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో జేడీ(యూ) కేవలం 43 సీట్లు సాధించగలిగితే, బీజేపీ 74 సీట్లతో రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

VIDEOS

logo