ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 15:07:12

ఒకే సీటు కోసం పోటీప‌డ్డ అన్నాద‌మ్ముళ్లు..

ఒకే సీటు కోసం పోటీప‌డ్డ అన్నాద‌మ్ముళ్లు..

హైద‌రాబాద్‌:  బీహార్‌లోని జోకిహ‌ట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో అన్నాద‌మ్ముళ్లు పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ అభ్య‌ర్థిగా స‌ర్ఫ‌రాజ్ ఆల‌మ్‌.. ఎంఐఎం అభ్య‌ర్థిగా ష‌హ‌నవాస్ ఆల‌మ్ పోటీలో ఉన్నారు.  అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జేడీయూ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన స‌ర్ఫ‌రాజ్ ఇటీవ‌లే ఆర్జేడీలో చేరారు. ఇక అన్నాద‌మ్ముళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న పోరులో.. మూడ‌వ అభ్య‌ర్థిగా బీజేపీ నుంచి పోటీప‌డుతున్న రంజిత్ యాద‌వ్ లీడింగ్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం 4030 ఓట్ల ఆధిక్యంలో రంజిత్ యాద‌వ్ ఉన్నారు.