మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 27, 2020 , 10:38:38

మ‌ను వివాదం.. బీజేపీ నేత ఖుష్బూ అరెస్టు

మ‌ను వివాదం.. బీజేపీ నేత ఖుష్బూ అరెస్టు

హైద‌రాబాద్‌: ఇటీవ‌ల బీజేపీలో చేరిన ఖుష్బూ సుంద‌ర్‌ను త‌మిళ‌నాడు పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. క‌డ‌లూరు జిల్లాలో జ‌ర‌గ‌నున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొనేందుకు ఖుష్బూ ప్ర‌య‌త్నించిన సంద‌ర్భంలో ఆమెను చెంగ‌ల్‌ప‌ట్టు పోలీసులు అరెస్టు చేశారు. విదుత‌లై చిరుతైగ‌ల్ క‌చ్చి(వీసీకే) గ్రూపు చీఫ్ తోల్ తిరుమావ‌ల‌న్.. ఇటీవ‌ల ఓ స‌మావేశంలో మ‌నుస్మృతిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళ‌ల‌ను మ‌నుస్మృతి కించ‌ప‌రిచిన‌ట్లు ఆయ‌న త‌న ప్ర‌సంగంలో విమ‌ర్శించారు.  మ‌హిళ‌ల‌ను కేవ‌లం సెక్స్ వ‌ర్క‌ర్లుగా మ‌నువు ట్రీట్ చేసిన‌ట్లు ఆరోపించారు.  మ‌నుస్మృతిపై నిషేధం విధించాల‌ని తిరుమావ‌ల‌న్ కోరారు. అయితే వీసీకే చీఫ్ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఇవాళ రాష్ట్రానికి చెందిన బీజేపీ మ‌హిళా శాఖ భారీ ఆందోళ‌న‌కు పూనుకున్న‌ది.  క‌డ‌లూరులో నిర్వ‌హించ‌నున్న ప్ర‌ద‌ర్శ‌న‌కు వెళ్తున్న ఖుష్బూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమావ‌ల‌న్ త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది.  త‌మిళ‌నాడు రాష్ట్ర‌వ్యాప్తంగా వీసీకే వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ బీజేపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు పిల‌పునిచ్చింది. తిరుమావ‌ల‌న్ వ్యాఖ్య‌లు వ‌ర్గ‌పోరుకు దారితీస్తుంద‌ని బీజేపీ ఆరోపిస్తున్న‌ది.