మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 14:54:04

ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లుపై కార్యక్రమాలు నిర్వహించండి..

ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లుపై కార్యక్రమాలు నిర్వహించండి..

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడంతోపాటు ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టి ఏడాది అవుతున్నది. ఈ నేపథ్యంలో వీటిపై కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. ఈ రెండు చట్టాలు అమలులోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సంబంధిత కార్యక్రమాలు నిర్వహించాలంటూ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇంచార్జీలకు లేఖలు రాసింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తని కల్పించే ఆర్టికల్ 370ని గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లఢక్ కేంద్ర పాలిత పాంత్రాలుగా విభజించింది. ఇక త్రిపుల్ తలాక్ నేరమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు గత ఏడాది జూలై 30న పార్లమెంట్ ఆమోదించడంతో చట్టంగా మారింది.logo