సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 22:48:22

బీజేపీ నేత కిడ్నాప్ కథ సుఖాంతం

బీజేపీ నేత కిడ్నాప్ కథ సుఖాంతం

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బీజేపీ నాయకుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బీజేపీ నాయకుడు మెహ్రాజుద్దీన్ మల్లాను  12 గంటల అనంతరం క్షేమంగా విడుదల చేశారు. కిడ్నాపర్లు ఆయనకు ఎలాంటి హాని తలపెట్టలేదు.

వాటర్‌గామ్ మునిసిపల్ కమిటీ వైస్ చైర్మన్ అయిన మెహ్రాజుద్దీన్ మల్లా.. సోపోర్ పట్టణానికి వెళ్తుండగా జిల్లాలోని రాఫియాబాద్ ప్రాంతంలోని మరాజిగుండ్ వద్ద కొందరు దుండగులు అపహరించారని మల్లా ఆరోపిస్తున్నారు. తన స్నేహితుడిని కలువడానికి నడుచుకుంటూ వెళ్తుండగా శాంట్రో కారులో వ‌చ్చిన కొందరు మేహ్ర‌జ్ ను బ‌ల‌వంతంగా లాక్కెళ్లారు. కిడ్నాప్ అయిన బీజేపీ నాయ‌కుడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. చివరకు ఆయనను క్షేమంగా వదిలిపెట్టి కిడ్నాపర్లు వెళ్లిపోయారు. మేహ్రాజ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. కిడ్నాప్ గురించి పోలీసులు ఆయనను ఆరా తీస్తున్నారు. 

సరిగ్గా వారం రోజుల క్రితం జ‌మ్ముక‌శ్మీర్ బీజేపీ నాయ‌కుడు వ‌సీం బ‌రితోపాటు ఆయ‌న తండ్రి, సోద‌రుడిని ఉగ్ర‌వాదులు కాల్చిచంపిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న బందీపోర్ జిల్లాలో చోటు చేసుకుంది. బీజేపీలో ఎవరూ చేరవద్ద‌ని హెచ్చ‌రిస్తూ కొద్ది రోజుల క్రితం బందీపొర జిల్లాలో పోస్ట‌ర్లు వెలిశాయి.


logo