సోమవారం 25 మే 2020
National - Apr 06, 2020 , 15:07:05

దీపాలు వెలిగించి ఫైరింగ్ జ‌రిపిన మ‌హిళా నేత.. వీడియో వైర‌ల్‌

దీపాలు వెలిగించి ఫైరింగ్ జ‌రిపిన మ‌హిళా నేత.. వీడియో వైర‌ల్‌

హైద‌రాబాద్‌:  క‌రోనాను త‌రిమేందుకు దీపాలు వెలిగించాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ల‌రాంపూర్ జిల్లాకు చెందిన బీజేపీ మ‌హిళా మోర్చా నేత మంజూ తివారీ ఆదివారం రాత్రి త‌న భ‌ర్త లైసెన్సు పిస్తోల్‌తో ఫైరింగ్ జ‌రిపింది. ఆ సంఘ‌ట‌న‌ను వీడియో తీసి ఆమె త‌న ఫేస్‌బుక్‌లో పెట్ట‌డంతో.. ఆ వీడియో వైర‌ల్ అయ్యింది.  ఇంట్లో రాత్రి 9 గంట‌ల‌కు దీపాలు వెలిగించిన త‌ర్వాత ఆమె గ‌న్‌తో ఫైరింగ్ చేసింది. ఇక కాంగ్రెస్ నేత‌లు ఆ మ‌హిళా నేత‌పై కేసు పెట్టాల‌ని డిమాండ్ చేశారు.  ఆమెపై సీఎం యోగి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు. త‌ప్పు జ‌రిగిపోయింద‌ని, మ‌రోసారి ఇలా చేయ‌ను అని ఆమె పోలీసులు ఎదుట వాంగ్మూలం ఇచ్చింది.logo