ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 17:23:15

మ‌ణిపూర్‌లో నాలుగుచోట్ల‌ బీజేపీ, ఒక స్థానంలో ఇండిపెండెంట్ విజ‌యం

మ‌ణిపూర్‌లో నాలుగుచోట్ల‌ బీజేపీ, ఒక స్థానంలో ఇండిపెండెంట్ విజ‌యం

ఇంఫాల్‌: మ‌ణిపూర్ ఉపఎన్నిక‌ల్లో అధికార భార‌తీయ జ‌న‌తాపార్టీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మొత్తం ఐదు స్థానాల్లో ఉపఎన్నిక‌లు జ‌రుగ‌గా నాలుగు స్థానాల్లో బీజేపీ విజ‌యం సాధించింది. భార‌త ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. బీజేపీ వాంగోయ్‌, సింఘాట్‌, సెయితు, వాంగ్‌జింగ్ స్థానాల్లో బీజేపీ అభ్య‌ర్థులు, లైలాంగ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర్య అభ్య‌ర్థి గెలుపొందారు. మ‌ణిపూర్ సీఎం బీరేన్‌సింగ్ కూడా ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ నాలుగు స్థానాల్లో గెలిచింద‌ని ప్ర‌క‌టించారు.  

బీజేపీ త‌ర‌ఫున వాంగ్‌య్ నుంచి ఓయినమ్‌ లుఖోయ్ సింగ్‌, సింఘాట్ నుంచి గిన్‌స్వాన్‌హౌ, సెయితు నుంచి న‌మ్‌తంగ్ హ‌వోకిప్‌, వాంగ్‌జింగ్ నుంచి ప‌వోనమ్ బ్రోజెన్‌సింగ్ గెలుపొందారు. ఇండిపెండెంట్‌గా లైలాంగ్ నుంచి వై అంటాస్‌ఖాన్ గెలిచారు. మ‌ణిపూర్‌లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాల‌కు న‌వంబ‌ర్ 7న పోలింగ్ జ‌రిగింది. ఈ రోజు (న‌వంబ‌ర్ 10న‌) ఫ‌లితాలు వెలువ‌డ్డాయి.  ‌  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.