మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 14:32:17

మ‌ణిపూర్ ఉప ఎన్నిక‌లు.. లీడ్‌లో బీజేపీ

మ‌ణిపూర్ ఉప ఎన్నిక‌లు.. లీడ్‌లో బీజేపీ

ఇంపాల్ : మ‌ణిపూర్‌లోని ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు న‌వంబ‌ర్ 7వ తేదీన ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ స్థానాలకు ఉద‌యం 8 గంట‌ల‌కు కౌంటింగ్ ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల సంఘం నివేదిక ప్ర‌కారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జ‌రిగిన లెక్కింపులో బీజేపీకి 33.4 శాతం, కాంగ్రెస్‌కు 23.7 శాతం, ఎన్‌పీఈపీ కు 10 శాతం ఓటింగ్ షేరింగ్ అయింది. రెండు స్థానాల్లో బీజేపీ గెలుపొంద‌గా మ‌రో రెండు స్థానాల్లో ముందంజ‌లో ఉంది. వాంగోయ్ స్థానం నుంచి బీజేపీకి చెందిన ఓనమ్ లుఖోయ్ సింగ్ సమీప ప్రత్యర్థి నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన ఖురైజాం లోకెన్ సింగ్‌ను 257 ఓట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచాడు. అదేవిధంగా సింఘాట్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీకి చెందిన జిన్సువాన్‌హౌ ఎన్నికైన‌ట్లు ఈసీఐ తెలిపింది. వాంగ్జింగ్ టెన్తా, సైతు స్థానాల్లో కూడా బీజేపీ అభ్య‌ర్థులు లీడింగ్‌లో ఉన్నారు. లిలాంగ్ నుంచి స్వ‌తంత్ర్య అభ్య‌ర్థి వై అంటాస్ ఖాన్ మ‌రో స్వ‌తంత్ర్య అభ్య‌ర్థి అబ్దుల్ నాసిర్ కంటే ముందంజ‌లో ఉన్నారు. లిలాంగ్ నియోజ‌క‌వ‌ర్గానికి బీజేపీ త‌న అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేదు.