బుధవారం 27 జనవరి 2021
National - Dec 21, 2020 , 15:44:43

బెంగాల్‌లో బీజేపీ 200 సీట్లు సాధిస్తుంది : అథవాలే

బెంగాల్‌లో బీజేపీ 200 సీట్లు సాధిస్తుంది : అథవాలే

పనాజీ : రాబోయే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కిపైగా స్థానాలు గెలుచుకుంటుందని, ఆ రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే సోమవారం విశ్వాసం వ్యక్తం చేశారు. పనాజీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఏ) మిత్రపక్షంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి నాలుగైదు సీట్లు కోరున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన నుంచే పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కలిసిన అనంతరం అథవాలే మాట్లాడారు. కోస్తా రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభాకు సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఆర్‌పీఐ (ఎ)కు పశ్చిమ బెంగాల్‌లో ఉనికిలో ఉందని, రాష్ట్రంలో 36శాతం ఎస్సీ జనాభా ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీని పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నాలుగైదు సీట్లు అడుగుతాం.. ఈ విషయంపై నడ్డా, అమిత్‌ షాతో చర్చించనున్నట్లు తెలిపారు.


logo