సోమవారం 01 మార్చి 2021
National - Jan 20, 2021 , 12:46:52

నందిగ్రామ్‌ నుంచే సువేందు అధికారి పోటీ!

నందిగ్రామ్‌ నుంచే సువేందు అధికారి పోటీ!

కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఆ రాష్ర్ట సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, బీజేపీలో చేరిన సువేందు అధికారి మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా మ‌మ‌త‌ను ఓడిస్తాన‌ని సువేందు అధికారి స్ప‌ష్టం చేశారు. సువేందు అధికారి సిట్టింగ్‌ స్థానమైన నందిగ్రామ్‌ (పుర్బో మేధినీపూర్‌) నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మ‌మ‌త ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. సువేందు అధికారిని అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దింపి మ‌మ‌త‌ను ఓడించాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీ త‌న‌ను నందిగ్రామ్‌లో అభ్యర్థిగా నిలిపితే మమతాబెనర్జీని కనీసం 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తా. లేదంటే రాజకీయాలను వదిలేస్తాను అని సువేందు తేల్చిచెప్పారు. 

VIDEOS

logo