బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 11:32:32

బెంగాల్‌లో బీజేపీ చ‌రిత్ర సృష్టించ‌బోతుంది : ముకుల్ రాయ్

బెంగాల్‌లో బీజేపీ చ‌రిత్ర సృష్టించ‌బోతుంది : ముకుల్ రాయ్

కోల్‌క‌తా : వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ బెంగాల్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ చ‌రిత్ర సృష్టించ‌బోతుంద‌ని ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు ముకుల్ రాయ్ ధీమా వ్య‌క్తం చేశారు. పురులియా నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ముకుల్ రాయ్ మాట్లాడారు. బెంగాల్ ప్ర‌జ‌లు ప్ర‌జాస్వామ్య పున‌రుద్ధ‌ర‌ణ కోసం వేచి చూస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఇప్పుడున్న ప్ర‌భుత్వ పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోతున్నార‌ని పేర్కొన్నారు. బెంగాల్‌లో అరాచ‌క పాల‌న కొన‌సాగుతోంద‌ని మండిప‌డ్డారు. రాష్ర్టంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు.. బీజేపీలో చేరేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని ముకుల్ రాయ్ చెప్పారు.  


logo