బుధవారం 27 జనవరి 2021
National - Dec 18, 2020 , 17:23:32

మున్సిపల్‌ భవనంపై ‘జై శ్రీరామ్‌’ జెండా ఎగురేసిన బీజేపీ

మున్సిపల్‌ భవనంపై ‘జై శ్రీరామ్‌’ జెండా ఎగురేసిన బీజేపీ

తిరువనంతపురం: కేరళలోని పాలక్కాడ్ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి గెలిచింది. ఈ నెల 16న ఫలితాలు వెలువడగా సంబరాలు జరుపుతున్నది. కాగా కొందరు బీజేపీ కార్యకర్తలు గురువారం స్థానిక మున్సిపల్‌ భవనంపై ‘జై శ్రీరామ్‌’ పేరుతో భారీ జెండాను ఎగురేశారు. మరాఠా యోధుడు శివాజీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పోస్టర్లు కూడా వేలాడ దీశారు. పాలక్కాడ్‌ నగరాన్ని కేరళలోని గుజరాత్‌గా బీజేపీ అధికార ప్రతినిధి సందీప్‌ వేరియర్ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో అభివర్ణించారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు బీజేపీ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు దీనికి బదులుగా వామపక్ష నేతలు శుక్రవారం పాలక్కాడ్‌ మున్సిపల్‌ భవనంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా, లౌకికవాదానికి మద్దతుగా నినాదాలు చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo