బుధవారం 27 జనవరి 2021
National - Nov 28, 2020 , 14:29:40

రైతుల్ని ప‌ట్టించుకోని బీజేపీ : అఖిలేశ్ యాద‌వ్‌

రైతుల్ని ప‌ట్టించుకోని బీజేపీ : అఖిలేశ్ యాద‌వ్‌

హైద‌రాబాద్: రైతుల‌ను బీజేపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ ఆరోపించారు. కొత్త‌గా తెచ్చిన కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలో పంజాబ్ రైతులు ధ‌ర్నా చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఆ ఆందోళ‌న‌ను ఉద్దేశిస్తూ ఇవాళ అఖిలేశ్ యాద‌వ్ మాట్లాడారు.  రైతుల్ని ఇంత హీనంగా గ‌తంలో ఏ పార్టీ కూడా చూడ‌లేద‌ని, కేవ‌లం బీజేపీ మాత్రమే ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.  రైతుల రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ‌ని చెప్పిన పాల‌కులే ఇప్పుడు రైతుల్ని పీడిస్తున్నార‌ని అఖిలేశ్ ఆరోపించారు. 


logo