మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 14:27:08

వ‌సీంబారీ కుటుంబానికి బీజేపీ అగ్ర నేత‌ల ప‌రామ‌ర్శ

వ‌సీంబారీ కుటుంబానికి బీజేపీ అగ్ర నేత‌ల ప‌రామ‌ర్శ

శ్రీన‌గ‌ర్: ఇటీవ‌ల ఉగ్ర‌వాదుల కాల్పుల్లో మ‌ర‌ణించిన బీజేపీ నాయ‌కుడు వ‌సీంబారీ కుటుంబాన్ని ఆదివారం ఆ పార్టీ అగ్ర‌నేత‌లు ప‌రామ‌ర్శించారు. కేంద్రమంత్రి జితేంద్ర‌సింగ్‌, బీజేపీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ రామ్‌మాధ‌వ్‌, జ‌మ్ముక‌శ్మీర్ బీజేపీ అధ్య‌క్షుడు ర‌వీంద‌ర్ రైనా వ‌సీంబారీ కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన వారిలో ఉన్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌ బీజేపీలో కీల‌క నేతగా ఉన్న వ‌సీంబారీని ఇటీవ‌ల ఉగ్ర‌వాదులు కాల్చిచంపారు. ఉగ్ర‌వాదుల కాల్పుల్లో వ‌సీంబారీతోపాటు అత‌ని సోద‌రుడు, తండ్రి కూడా హ‌త‌మ‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo