మంగళవారం 14 జూలై 2020
National - Jun 27, 2020 , 14:14:38

అవ‌న్నీ అర్థ స‌త్యాలే.. న‌డ్డా‌పై చిదంబ‌రం ఫైర్‌

అవ‌న్నీ అర్థ స‌త్యాలే.. న‌డ్డా‌పై చిదంబ‌రం ఫైర్‌

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని స‌హాయ నిధి నుంచి యూపీఏ హ‌యంలో రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్‌కు నిధులు మ‌ళ్లించిన‌ట్లు బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆరోపించిన విషయం తెలిసిందే.  దీనిపై ఇవాళ కాంగ్రెస్ నేత చిదంబ‌రం రియాక్ట్ అయ్యారు.  జేపీ న‌డ్డా అన్నీ అర్థ స‌త్యాలు మాట్లాడుతున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. 2005లో మ‌న్మోహ‌న్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్‌జీఎఫ్‌కు 20 ల‌క్ష‌లు బ‌దిలీ చేశారు. దీన్ని న‌డ్డా త‌ప్పుప‌ట్ట‌డాన్ని చిదంబ‌రం వ్య‌తిరేకించారు. ఆ డ‌బ్బును సునామీతో దెబ్బ‌తిన్న అండ‌మాన్ దీవుల్లో ఖ‌ర్చు చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 

ఆర్‌జీఎఫ్ నిధుల‌కు, చైనా ఆక్ర‌మ‌ణ‌కు ఏం సంబంధం ఉంద‌ని చిదంబ‌రం అడిగారు. ఒక‌వేళ ఆ డ‌బ్బును ఇప్పుడు తిరిగిస్తే, తాజాగా చైనా ఆక్ర‌మించిన భూభాగాన్ని ప్ర‌ధాని మోదీ తీసుకురాగ‌ల‌రా అని చిద‌రంబ‌రం బీజేపీని ప్ర‌శ్నించారు. ఆర్‌జీఎఫ్‌కు విరాళాలు ఇస్తున్న చైనా ఎంబసీ ఒక‌ర‌కంగా కాంగ్రెస్ పార్టీకి స‌హ‌కరిస్తున్న‌ట్లు బీజేపీ ఆరోపించింది. చైనా సంక్షోభం నుంచి దారి మ‌ళ్లించేందుకు బీజేపీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు చిదంబ‌రం అన్నారు.


logo