శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 08:55:16

'త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేశాడు.. ఎంపీగా అన‌ర్హుడు'

'త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేశాడు.. ఎంపీగా అన‌ర్హుడు'

కోల్‌క‌తా : బీజేపీ నాయ‌కుడు అర్జున్‌సింగ్‌ లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల్సిందిగా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నిక‌ల్లో త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేశారని ఆరోపించింది. కాగా ఈ ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వి అర్జున్‌సింగ్ కొట్టిపారేశారు. ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాల్సిందిగా అధికార పార్టీకి స‌వాల్ విసిరారు. అర్జున్‌సింగ్ 2019లో టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. బరాక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా కొన‌సాగుతున్నారు.

కోట్ల విలువైన షేర్ల‌ను ఆయ‌న క‌లిగి ఉన్నార‌ని ఇవి ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పొందుప‌ర‌చ‌లేద‌ని టీఎంసీ ఆరోపిస్తోంది. ఎన్నిక‌ల సంఘం ముందు ఆయ‌న అబాద్దాలు చెప్పాడని నార్త్ 24 పరగనాస్ జిల్లా టీఎంసీ యూనిట్ సీనియర్ నాయకుడు సోమంత్ షామ్ ఆరోపించారు. అర్జున్‌సింగ్ లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు కోరుతూ తాము త్వ‌ర‌లోనే న్యాయ‌స్థానాన్ని అదేవిధంగా ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్ర‌యించ‌నుట్లు పేర్కొన్నాడు. 


logo