సోమవారం 30 మార్చి 2020
National - Feb 11, 2020 , 01:17:17

అది బీజేపీ ఆరెస్సెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది!

అది బీజేపీ ఆరెస్సెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది!

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల రద్దుకు ప్రయత్నించడం బీజేపీ, ఆరెస్సెస్‌ డీఎన్‌ఏలోనే ఉన్నదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. అణగారిన వర్గాల హక్కులను లాక్కునేందుకు ‘పెద్ద కుట్ర’ జరుగుతున్నదని ఆరోపించారు. సోమవారం పార్లమెంట్‌ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ ఎంత కలగన్నప్పటికీ దాన్ని తాము సాకారం కానీయబోమని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల పొందేందుకు ప్రాథమిక హక్కేమీ లేదని ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. రిజర్వేషన్ల రాజ్యాంగహక్కుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభు త్వం సుప్రీంకోర్టులో ప్రకటన చేసిందని విమర్శించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల తర్వాత ఈ హక్కులు లభించాయని, వీటిని లాక్కునేందుకు నేడు పెద్దకుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఇంతకంటే పెద్దద్రోహం ఏమైనా ఉన్నదా అని విలేకరులను ప్రశ్నించారు.
logo