శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 09:37:45

ప్ర‌తిప‌క్ష ఎంపీల‌పై రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు బీజేపీ ఫిర్యాదు

ప్ర‌తిప‌క్ష ఎంపీల‌పై రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు బీజేపీ ఫిర్యాదు

న్యూఢిల్లీ: వ్య‌వ‌సాయ మార్కెటింగ్ రంగంలో సంస్క‌ర‌ణ‌లు ప్ర‌తిపాదిస్తూ రూపొందించిన బిల్లులను కేంద్ర ప్ర‌భుత్వం నిన్న రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాలు ఈ బిల్లుల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించాయి. కొంద‌రు స‌భ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి డిప్యూటీ చైర్మ‌న్‌పై పుస్త‌కాలు విసిరేందుకు ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిన్న గంద‌ర‌గోళం సృష్టించిన స‌భ్యుల‌పై అధికార‌ బీజేపీ ఎంపీలు రాజ్య‌స‌భ చైర్మ‌న్ ఎం వెంక‌య్య‌నాయుడికి ఫిర్యాదు చేశారు.  ఆ స‌భ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌పై చైర్మ‌న్ స‌స్పెన్ష‌న్ విధించే అవ‌కాశం ఉన్న‌ది. 


logo