సోమవారం 13 జూలై 2020
National - Jun 20, 2020 , 14:52:32

ఆయ‌నో తెలివి త‌క్కువ నేత‌: బీజేపీ.. వీడియో

ఆయ‌నో తెలివి త‌క్కువ నేత‌: బీజేపీ.. వీడియో

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాహుల్‌గాంధీ పేరును ప్ర‌స్తావించ‌కుండానే ఆయ‌న‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌-చైనా సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించి రాహుల్‌గాంధీ కేంద్ర ప్ర‌భుత్వంపై వ‌రుస‌గా విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌టాన్ని న‌డ్డా త‌ప్పుప‌ట్టారు. 

మ‌నమంతా గ‌ల్వాన్‌లో చైనా సేన‌ల‌తో పోరాటం చేస్తుంటే ఒక నాయ‌కుడు మాత్రం మ‌న సేన‌ల స్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా వ‌రుస ట్వీట్లతో విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ప‌రోక్షంగా రాహుల్‌గాంధీపై జేపీ న‌డ్డా విమ‌ర్శ‌లు చేశారు. ఆ ట్వీట్లు ఆయ‌న మిడిమిడి ప‌రిజ్ఞానాన్ని, తెలివి త‌క్కువ త‌నాన్ని సూచిస్తున్నాయ‌ని చెప్పారు. 'మీరు మీ సొంత ప్ర‌ధానిని ఎలాగూ గౌర‌వించ‌లేదు. క‌‌నీసం ప్ర‌ధాని మోదీకైనా గౌర‌వం ఇవ్వండి' అని న‌డ్డా ఎద్దేవా చేశారు.    


logo