శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 02:29:44

బీజేపీ ప్లాన్‌ ‘బీ’.. నిత్యానంద్‌ రాయ్‌!

బీజేపీ ప్లాన్‌ ‘బీ’.. నిత్యానంద్‌ రాయ్‌!

పాట్నా: బీహార్‌లో సొంతం గా అధికారంలోకి రావడానికి బీజేపీ ప్లాన్‌ ‘బీ’ని సిద్ధం చేసుకుందా.. తీవ్ర విమర్శల పాలవుతున్న నితీశ్‌ కుమార్‌ను పక్కన పెట్టనుందా.. అంటే అవుననే తెలుస్తున్నది. ఆ ప్లాన్‌లో భాగంగానే కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ను తెరమీదకు తెస్తున్నదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ప్రచారానికి కూడా ఆయన ప్రధాని మోదీనే నమ్ముకున్నారు. దీనినే బీజేపీ అవకాశంగా మలచుకోవాలని చూస్తున్నది. నిత్యానంద్‌ రాయ్‌ను రంగప్రవేశం చేయించి ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్న సామెత చందంగా అటు నితీశ్‌ను, ఇటు ఆర్జేడీని దెబ్బకొట్టాలని చూస్తున్నది. నిత్యానంద్‌ రాయ్‌ యాదవ కులస్థుడు. బీహార్‌లో ఆర్జేడీ బలం యాదవులే. ఆర్జేడీ ఓటు బ్యాంకుకు గండికొట్టి సొంతంగా అధికారంలోకి రావాలంటే సీఎం అభ్యర్థిగా యాదవ కులానికి చెందిన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ముందుకు తీసుకువస్తే బాగుంటుందని బీజేపీ యోచిస్తున్నది. అందుకే ఈ ఎన్నికల్లో నిత్యానంద్‌తో విరివిగా ప్రచారం చేయిస్తున్నది.