శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 12:48:03

బీజేపీ పెంపుడు సంస్థ ఎన్‌ఐఏ : మోహబూబా ముఫ్తీ

బీజేపీ పెంపుడు సంస్థ ఎన్‌ఐఏ : మోహబూబా ముఫ్తీ

న్యూఢిల్లీ :  జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్‌ఐఏ) బీజేపీ పెంపుడు సంస్థలా వ్యవహరిస్తున్నదని  పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మోహబూబా ముఫ్తీ ఆక్షేపించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి లొంగని వారిపై ఎన్‌ఐఏను అడ్డుపెట్టుకొని దాడులు చేస్తూ వారిని అదుపులో పెట్టేందుకు యత్నిస్తుందని ఆరోపించారు. 

ఇటీవల ఎన్‌ఐఏ శ్రీనగర్‌, బందీపూర్‌, బెంగళూర్లలోని పలుచోట్ల‌, ఖుర్రమ్‌ ఫర్వేజ్‌ ఇంటితోపాటు అథ్రోట్ ఎన్జీఓ ‌, గ్రేటర్‌ కశ్మీర్‌ ట్రస్టు అధికారుల ఇండ్లలో వరుస సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మానవహక్కుల కార్యకర్త ఖుర్రమ్‌ ఫర్వేజ్‌ ఇంటితోపాటు శ్రీనగర్‌లోని గ్రేటర్‌ కశ్మీర్‌ కార్యాలయంలో సోదాలు భావప్రకటన స్వేచ్ఛ, అసమ్మతిపై భారత ప్రభుత్వం సాగిస్తున్న దారుణ అణచివేతకు ఉదాహరణలని ఆమె అభివర్ణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.