బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 13:11:00

యూపీ ఉప ఎన్నికల కౌంటింగ్.. లీడ్‌లో బీజేపీ

యూపీ ఉప ఎన్నికల కౌంటింగ్.. లీడ్‌లో బీజేపీ

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక ఫ‌లితాల కౌంటింగ్ కొన‌సాగుతుంది. నౌగాన్ సదాత్, తుండ్లా, బంగార్‌మౌ, బులంద్‌షహర్, డియోరియా, ఘటంపూర్, మల్హాని నియోజ‌క‌వ‌ర్గాల‌కు న‌వంబ‌ర్ 3వ త‌దీన ఉప ఎన్నిక జ‌రిగింది. మొత్తం 88 అభ్య‌ర్థులు ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. సగటున 53 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెల్లడైతున్న తాజా కౌంటింగ్ ఫ‌లితాల ప్ర‌కారం.. బులంద్‌షహర్, బంగార్‌మౌ, డియోరియా, తుండ్లా, ఘటంపూర్, నౌగాన్ స‌దాత్‌ ‌లలో భారతీయ జనతా పార్టీ లీడింగ్‌లో దూసుకెళ్తుంది. కాగా మ‌ల్హానిలో స్వతంత్ర అభ్యర్థి ధనంజయ్ సింగ్ 1,700 ఓట్లతో ముందంజలో ఉన్నారు. స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ సోమ‌వారం వ‌ర్చువ‌ల్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ అధికారాన్ని ఉప‌యోగించుకుని ఉపఎన్నిక‌లో రిగ్గింగ్‌, మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోపించారు. ఓటర్లు బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్ర‌యత్నించింద‌న్నారు. ఫలితాల వెల్ల‌డి అనంత‌రం తాను ఇందుకు సంబంధించిన‌ సవివరమైన సమాచారం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.