ఆదివారం 24 జనవరి 2021
National - Dec 20, 2020 , 17:14:07

ఒడిశా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పాదయాత్ర

ఒడిశా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పాదయాత్ర

భువనేశ్వర్‌: ఒడిశాలోని బిజు జనతాదళ్ (బీజేడీ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆదివారం భారీ పాదయాత్ర నిర్వహించింది. ఐదు నెలల కిందట నయాగఢ్‌ జిల్లాకు చెందిన ఐదేండ్ల బాలిక పరీపై లైంగికదాడి, హత్య ఘటనకు వ్యతిరేకంగా భువనేశ్వర్‌లో భారీ ప్రదర్శన చేపట్టింది. పరీకి న్యాయం చేయాలని ఒడిశాకు చెందిన బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఐదేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు దారుణంగా హత్య చేయడం బాధాకరమని బీజేపీ నాయకుడు సంబిత్ పత్రా ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలమైన ఆమె అస్థిపంజరం ఆ ఇంటి ముందరే పూడ్చి ఉన్నదని అన్నారు. ఈ కేసులో స్థానిక ఎమ్మెల్యే పేరు, ఆయన కాపాడేందుకు ప్రయత్నిస్తున్న మరొకరి పేరు వెలుగులోకి వచ్చాయని విమర్శించారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, మంత్రి అరుణ్ సాహు రాజీనామా చేయాలన్నది తమ డిమాండ్లని సంబిత్ పత్రా తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo