బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 13:54:52

పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు

పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. నిన్న వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ 62 స్థానాలతో భారీ విజయం సాధించి, మరోసారి ఢిల్లీ పీఠాన్ని అధిష్టించింది. బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో గెలిచి, రాజధాని రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని ఆరాటపడిన బీజేపీ.. మరోసారి భంగపడింది. పార్టీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవడంతో బీజేపీ ఆందోళనలో పడింది. దీంతో, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జెనరల్‌ సెక్రటరీలతో ఎన్నికలకు సంబంధించి రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ సమావేశంలో విశ్లేషించనున్నారు. తదనంతరం, ఢిల్లీలో పార్టీ పటిష్టతకు చేపట్టబోయే విధివిధానాలను రూపొందిస్తారు. 


logo