సోమవారం 30 మార్చి 2020
National - Mar 18, 2020 , 09:47:00

స్వీయ నిర్బంధంలో కేంద్ర మాజీ మంత్రి

స్వీయ నిర్బంధంలో కేంద్ర మాజీ మంత్రి

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సురేశ్‌ ప్రభు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సౌదీ పర్యటన నిమిత్తం సురేశ్‌ ప్రభు మార్చి 10న వెళ్లారు. సౌదీలో ఏర్పాటు చేసిన జీ 20 దేశాల సమ్మేళనం సన్నాహక సమావేశానికి సురేశ్‌ ప్రభు హాజరయ్యారు. సౌదీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆ ఫలితాల్లో కరోనా నెగిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు స్వీయ నిర్బంధంలో ఉండాలని సురేశ్‌ ప్రభు నిర్ణయించుకున్నారు. 14 రోజుల స్వీయ నిర్బంధంలోకి కేంద్ర మాజీ మంత్రి వెళ్లారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడుకు సురేశ్‌ ప్రభు లేఖ రాశారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.


logo