టీఎంసీలో చేరిన భార్యకు విడాకులు ఇస్తానన్న బీజేపీ ఎంపీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీకి షాక్ ఇచ్చి టీఎంసీలో చేరిన భార్య సుజాత మండల్ ఖాన్‌కు విడాకులు ఇస్తానని బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ తెలిపారు. తన కుటుంబాన్ని చీల్చినందుకు టీఎంసీ సిగ్గుపడాలని ఆయన విమర్శించారు. సుజాత ఇప్పటి వరకు బీజేపీ ఎంపీ భార్యగా గౌరవం పొందారని అన్నారు. ఇకపై తన పేరు, ఇంటి పేరు నుంచి ఆమెకు విముక్తి ఇస్తున్నానని మీడియా సమావేశంలో సౌమిత్ర ఖాన్ తెలిపారు. ఆమె కావాలంటే తన ఆస్తిని తీసుకోవచ్చని లేకపోతే ప్రజలకు దానం చేస్తానని ఆయన చెప్పారు.
టీఎంలో చేరి తన భార్య తప్పు చేసిందని బిష్ణుపూర్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ ఆవేదనగా అన్నారు. ‘నేను అభిషేక్ బెనర్జీకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సుజాత నా ఏకైక బలహీనత. ఇప్పుడు నేను నా పార్టీ బీజేపీ కోసం అన్నింటినీ త్యాగం చేస్తాను’ అని వ్యాఖ్యానించారు. అలాగే తన భార్య సుజాతకు విడాకుల నోటీసు పంపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘నేను విడాకుల నోటీసు పంపుతాను. నేను టీఎంసీతో పోరాడతాను. నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినందుకు మీరు సిగ్గుపడాలని టీఎంసీకి చెప్పాలనుకుంటున్నాను. చాలా పోరాటాలు జరిగాయి, కానీ ఇది జరుగుతుందని అనుకోలేదు’ అని సౌమిత్ర ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని విడదీసిన వారి క్షమించబోనని అన్నారు. మమతా బెనర్జీ పార్టీని రాష్ట్రం నుండి తరిమివేస్తారని ఆయన సవాల్ చేశారు.
బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మండల్ ఖాన్ సోమవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎంపీ సౌగత రాయ్, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ఆమెను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుజాత.. బీజేపీ కోసం తాము ఎంతో కష్టపడి పని చేశామని, కానీ ఆ పార్టీలో గౌరవం లేకుండా పోయిందని విమర్శించారు. అవినీతిపరులకు గాలం వేసి బలపడేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. మమతా బెనర్జీ కోసం పని చేయడం ఒక మహిళగా తనకు గౌరవం ఉంటుందని తాను భావిస్తున్నానని తెలిపారు. ఎంపీ సౌమిత్ర ఖాన్ తృణమూల్‌లో చేరుతారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ భవిష్యత్‌లో ఏం జరగబోతోందో ఎలా చెప్పగలమని సుజాత పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ