ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 15:31:20

సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే : బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే

సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే : బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే

ముంబై : నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాలుగు నెలల అనంతరం బీజేపీ ఎంపీ కొత్త వాదన లేవనెత్తారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురయ్యాడని బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే ఆరోపించారు. ఆ సమయంలో సుశాంత్ ఇంట్లో ఒక మహారాష్ట్ర మంత్రి కూడా ఉన్నారని చెప్పారు. సుశాంత్ కేసును సరిగ్గా దర్యాప్తు చేసినట్లయితే మహారాష్ట్ర మంత్రి జైలుకు వెళ్తారు అని రాణే అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని సీబీఐకి మాత్రమే ఇస్తానని ఒక వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ్‌ రాణే పేర్నొన్నారు. సంఘటన జరిగిన రాత్రి కొంతమంది సుశాంత్ ఇంటికి వెళ్లి దిశను హత్య చేసినట్లు సుశాంత్‌ను ప్రశ్నించిన తర్వాత ఆయనతో గొడవకు దిగారని తెలిపారు. ఈ ఘర్షణలో సుశాంత్ హతమయ్యాడు అని చెప్పారు.

నారయణ్‌ రాణేకు ముందు ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే కూడా అయిన నితేష్.. మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఈ కేసులో సుశాంత్‌, దిశకు న్యాయం జరుగదని ఆరోపించారు. సీబీఐ సక్రమంగానే విచారణ జరుపుతున్నదని, అందుకే మేం ప్రశాంతంగా ఉన్నామని చెప్పారు. 

జూన్ 14 న సుశాంత్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో చనిపోయి వేలాడుతూ కనిపించాడు. ముంబై పోలీసులు, బిహార్ పోలీసులు, ఎన్‌సీబీ, సీబీఐ, ఈడీ.. తదితర సంస్థలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో చాలా మందిని సీబీఐ ప్రశ్నించింది. నారాయణ్ రాణే వాదనల తర్వాత.. సీబీఐ అతడిని కూడా ప్రశ్నించేందుకు పిలిచే అవకాశం ఉన్నదని నిపుణులు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.