సోమవారం 30 మార్చి 2020
National - Mar 02, 2020 , 18:04:30

బీజేపీ ఎంపీ నాపై దాడి చేశారు.. కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు

బీజేపీ ఎంపీ నాపై దాడి చేశారు.. కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు

హైద‌రాబాద్‌:  పార్ల‌మెంట్‌లో ఇవాళ ఇద్ద‌రు మ‌హిళా ఎంపీలు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు.  బీజేపీకి చెందిన మ‌హిళా ఎంపీ జ‌స్‌కౌర్ మీనా త‌న‌పై భౌతికంగా దాడికి దిగిన‌ట్లు కాంగ్రెస్‌కు చెందిన మ‌హిళా ఎంపీ ర‌మ్యా హ‌రిదాస్ ఆరోపించారు.  లోక్‌స‌భ ఆవ‌ర‌ణ‌లో ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తున్న త‌న‌పై ఎంపీ మీనా దాడి చేసిన‌ట్లు కాంగ్రెస్ ఎంపీ ర‌మ్యా .. స్పీక‌ర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మార్చి 2వ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఆమె ఆ లేఖ‌లో తెలిపారు. ద‌ళిత మ‌హిళ కాబ‌ట్టే త‌న‌పై ప‌దేప‌దే దాడి చేస్తున్న‌ట్లు ఆమె ఆరోపించారు.  కాంగ్రెస్ ఎంపీ ర‌మ్య చేసిన ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ ఎంపీ కొట్టిరేశారు.  ఆ ఆరోప‌ణ‌లు వాస్త‌వం కాదు అని మీనా అన్నారు. లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ ఎంపీ బ్యాన‌ర్ ప‌ట్టుకున్న స‌మ‌యంలో అది త‌న త‌ల‌కు త‌గిలింద‌ని, అప్పుడు ఆమెను ముందుకు వెళ్లామ‌ని అన్నాన‌ని,  ఆమెపై చేయి చేసుకోవ‌డం కానీ, నెట్ట‌డం కానీ చేయ‌లేద‌ని, తాను కూడా ద‌ళిత మ‌హిళ‌నే అని ఎంపీ జ‌స్‌కౌర్ మీనా అన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. బీజేపీ మ‌హిళా ఎంపీల‌తో కాంగ్రెస్ ఎంపీనే దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆరోపించారు. ఈ విష‌యాన్ని స్పీక‌ర్ వ‌ద్ద‌కు తీసుకువెళ్ల‌నున్న‌ట్లు ఆమె చెప్పారు.logo