బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, పార్టీ కార్యకర్త చెంపపై కొట్టారు. మాండ్యాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పార్టీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు డీకే శివకుమార్ మాండ్యాకు వచ్చారు. ఈ సందర్భంగా పక్కన నడుస్తున్న ఒక కార్యకర్త ఆయన భుజంపై చేయి వేసేందుకు ప్రయత్రించాడు. దీనిని అడ్డుకున్న శివకుమార్ అందరూ చూస్తుండగా అతడి చెంపపై కొట్టారు. ‘ఏమిటీ ఈ పద్ధతి. నీకు స్వేచ్ఛ ఇచ్చా. అయితే ఇలా చేయమని కాదు’ అని ఆ కార్యకర్తపై మండిపడ్డారు.
కాగా, ఈ ఘటనపై కర్ణాటకలోకి అధికార బీజేపీ నేతలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ చీఫ్ అయిన తర్వాత డీకే శివకుమార్ పద్ధతి మారిందని, తన కేడర్ పట్ల ఆయన అహం ప్రదర్శిస్తున్నారని, కార్యకర్తలతో సరిగ్గా వ్యవహరించడం లేదని ఆరోపించారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.